శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మనమే. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇక తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు శర్వాకు మంచి హిట్ పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిశెట్టి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ నేను పాత్రలు చేశాను.. ఎక్కువగా చాలాకీగా ఉండే పాత్రల్లోనే కనిపించాను.. కానీ ఈసినిమాలో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిపింది. అంతేకాదు తన డ్రీమ్ రోల్ గురించి చెబుతూ.. బాహుబలి సినిమాలోని అనుష్క చేసినటువంటి దేవసేన తరహా ప్రిన్సెన్స్ పాత్రలు చేయాలని ఉందని తెలిపింది. ఇంకా యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉన్న సినిమాలు చేయడం కూడా ఇంట్రెస్ట్ అని తెలిపింది. మరి చూద్దాం ఫ్యూచర్ లో ప్రిన్సెన్స్ తరహా పాత్రలు కృతిశెట్టిని ఏమైనా వరిస్తాయోమో..
ఇంకా ఈసినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: