పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు.ఇది రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.ఇక ఈసినిమా స్టార్ట్ అయ్యి మూడు ఏళ్లు అవుతున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.పవన్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఇప్పుడు ఈసినిమాను తొందరగా పూర్తి చేయడానికి టీం రెడీ అవుతుంది.పవన్ కూడా ఎలక్షన్స్ రిజల్ట్ తరువాత ఈసినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడని సమాచారం దాంతో ఈసినిమాను ఆగస్టు లోగా పూర్తి చేసి డిసెంబర్ లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.మరోవైపు ఓజీ సెప్టెంబర్ 27న వస్తుందని ముందు ప్రకటించినా వెనక్కి వెళ్లడం తప్పేలా లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్, హరిహర వీరమల్లు పై ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో ఓజీ బ్యాలెన్స్ షూటింగ్ కూడా ఆలస్యం గా స్టార్ట్ కానుంది.దానికి తోడు బిజినెస్ కారణాల వల్ల వచ్చే ఏడాదికి రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది.ఎలాగైతేనేం పవన్ ఫ్యాన్స్ కు హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ రూపంలో ఈఏడాది ఓ రిలీజ్ అయితే పక్కాగా ఉండనుంది.
ఇక హరిహర వీరమల్లు బ్యాలెన్స్ పార్ట్ ను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు.క్రిష్ ఈసినిమాను పూర్తి చేయాల్సి ఉండగా తనకు వున్న కమిట్ మెంట్ వల్ల తప్పుకున్నాడు.అయితే ఈసినిమాకు క్రిష్ పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నడు.రీసెంట్ గా రిలీజైన టీజర్ ఈసినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అంతేకాదు పవన్ కు ఇదే తొలి పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ఈసినిమాలో నిధి అగర్వాల్ ,బాబీ డియోల్,నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.ఏ ఏం రత్నం నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: