విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.రివ్యూస్ తో సంబంధంలేకుండా అంచనాలకు మించి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 8.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఇందులో షేర్ 4కోట్ల పైనే.మొత్తం 12కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఈ రెండు రోజులు ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను చేరుకోనుంది. విశ్వక్ కెరీర్ లో ఇవే బెస్ట్ ఓపెనింగ్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A Smashing 𝟖.𝟐 𝐜𝐫𝐨𝐫𝐞 opening day worldwide gross for our #GangsofGodavari 🔥🔥🔥
At the box office, numbers matter the most and speak the loudest! 🤩
Going Houseful everywhere, grab your tickets now! 🍿
Don’t miss 𝐌𝐀𝐒𝐒 𝐊𝐀 𝐃𝐀𝐒… pic.twitter.com/rnOoZvsf1a
— Sithara Entertainments (@SitharaEnts) June 1, 2024
ఇక నిన్న తెలుగులో మూడు సినిమాలు విడుదలకాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డామినేషన్ కొనసాగింది.బుక్ మై షోలో మొదటి రోజు 70000కుపైగా టికెట్స్ తెగాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.యూఎస్ఏ ప్రీమియర్స్ గ్రాస్ 100k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.ఓవరాల్ గా గత కొన్ని రోజులగా సినిమాలు లేక లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బూస్ట్ ఇచ్చింది.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: