సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అశోక్ గల్లా. హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్ మొదటిసినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు రెండేళ్ల తరువాత ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం అశోక్ హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి అర్థమవుతుంది. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో బురదలో జరిగే ఫైట్ సన్నివేశంతో కట్ చేసిన ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈసినిమా నుండి జై భోలో కృష్ణ పాటకు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే వచ్చింది. అంతేకాదు ఈపాట ప్రోమో ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రఘురామ్ రాసిన ఈ పాటను స్వరాగ్ కీర్తన్ పాడాడు.
On this very special day getting overwhelmed with all the memories with you, where for the most it was like spending time the Sun himself 🌞
Today I feel lucky and blessed to be able to share this small tribute #JaiBoloKrishna hoping that up there it brings out the Legendary… pic.twitter.com/siSJTKTD5N
— Ashok Galla (@AshokGalla_) May 31, 2024
కాగా ఈసినిమాలో మానస హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























