అల్లరి నరేష్ మా ఇంట్లో మనిషిలాంటివాడు – అడివి శేష్

Adivi Sesh Interesting Comments on Allari Naresh

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తోంది. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరవగా.. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. నరేష్ గారితో నాకు చాలా గొప్ప అనుబంధం వుంది. నా ఫస్ట్ ఆడియో లాంచ్‌కి నరేష్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ రోజు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం చాలా ఆనందంగా వుంది. నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి. ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. ఆయన్ని ఎప్పుడూ కలసినా చాలా ఆత్మీయంగా వుంటుంది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అబ్బూరి రవి గారు నా కెరీర్‌కి బ్యాక్ బోన్. మేమిద్దరం కలిసి ఏడు సినిమాలు చేశాం. రాజీవ్ గారు ఐకానిక్ యానిమేషన్ మూవీస్ పిల్లల్ని ఎలా ఇన్‍స్పైర్ చేశారో అలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఫరియాని ఫస్ట్ టైం కలిశాను. చాలా అమాయకంగా కనిపించారు. ఇదే ఇన్నోసెన్స్ కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తారు. మల్లికి నా బెస్ట్ విశేష్. మా అన్నయ్య టీంలో ఆయన పని చేశారు. మే 3న అందరం థియేటర్స్‌లో సినిమా చూద్దాం. హాయిగా నవ్వుకుందాం” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.