బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న టిల్లు స్క్వేర్

Tillu Square Collects Over Rs. 94 Cr Gross in 7 Days

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందు నుంచీ ఊహించినట్టుగానే ఈ సినిమాకు తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ మూవీ స‌క్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో కేవలం 4 రోజుల్లోనే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘టిల్లు స్క్వేర్’ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం రూ.94 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి 100 కోట్లకు చేరువలో ఉంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

ఇక రేపు, ఎల్లుండి వీకెండ్ కావడం, తర్వాతి వారంలో ఉగాది, రంజాన్ పండుగ సెలవులు ఉండటం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. ఈ క్రమంలో ఈజీగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించనుంది ‘టిల్లు స్క్వేర్’. తద్వారా సిద్దు జొన్నలగడ్డ కెరీర్ లో తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కాగా టిల్లు స్క్వేర్‌ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.