పుష్ప 2- తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి లుక్

rashmika mandanna look reveal from pushpa2 movie

పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎంత సంచలనం సృష్టించిందో చూశాం కదా. ఇప్పుడు అందరి చూపు పుష్ప2పై పడింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు హిందీ ఆడియన్స్ ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉండటం కామన్. దానికి తగ్గట్టే మేకర్స్ ఎక్కడా తగ్గకుండా సినిమాను తీస్తున్నారట. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా తన సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా పుష్ప2 నుండి కూడా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు పుష్ప2 లోని ఆమె లుక్‌ను రివీల్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్‌లో పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా బంగారంతో, చేతికి గాజులు, మెడలో హారాలు, నడుముకి వడ్డాణంతో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ఉంది రష్మిక లుక్.

మరోవైపు ఫ్యాన్స్ ఇప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఏప్రిల్ 8వ తేదీ కోసం. ఆరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు కావున.. ఇప్పటికే ఆరోజు టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ టీజర్ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఉంది.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =