సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య మార్చి 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలోని కామెడీ, డైలాగ్స్, యాక్షన్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ అయి ఆరు రోజులవుతున్నా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. రోజు రోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ వెళుతుంది. ఇక ఆరు రోజుల్లో ఈసినిమా 91 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. వీకెండ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఉగాది, రంజాన్ పండుగలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈసినిమాకు మరింత కలిసొస్తుంది. దీంతో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదనిపిస్తుంది.
#TilluSquare Double Blockbuster Run at the box-office is unstoppable, grosses over 𝟗𝟏 𝐂𝐑 𝐢𝐧 𝟔 𝐃𝐚𝐲𝐬! 💥
All set to cross 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Mark!! 🔥😎
Our Starboy 🌟 shattering records all over! 🤘
– https://t.co/vEd8ktSAEW pic.twitter.com/lb0pYUwib4
— Sithara Entertainments (@SitharaEnts) April 4, 2024
కాగా ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: