ఇండియా టాప్ ట్రెండింగ్ లో సేవ్ ది టైగర్స్ 2

save the tigers season 2 create new records in ott

తేజా కాకుమాను ద‌ర్శ‌క‌త్వంలో ప్రియ‌ద‌ర్శి, చైత‌న్య‌కృష్ణ‌, అభిన‌వ్ గోమ‌టం, సుజాత‌, దేవ‌యాని, పావ‌ని గంగిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. భార్య భర్తల కథాంశంతో.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసిరీస్ గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవ్వగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సీజన్ సెకండ్ రీసెంట్ గానే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సెకండ్ సీజన్ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దీంతో ఓటీటీలో అదిరిపోయే స్ట్రీమింగ్ ని అందుకుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఇండియా వైడ్ గా ఈవెబ్ సిరీస్ సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది. ఇండియన్ టాప్ వెబ్ సిరీస్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 మూడో స్థానంలో నిలిచి తెలుగు వెస్ సిరీస్ సత్తాని చాటుతుంది.

ఇదిలా ఉండగా రెండు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు మూడో సీజన్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని.. జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్నామని నిర్మాత మహి.వి రాఘవ తెలియచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.