షూటింగ్‌లో అజిత్ రిస్కీ స్టంట్.. కారు ప్ర‌మాదం వీడియో వైర‌ల్

Ajith Kumar's Risky Stunt Video From Vidaa Muyarchi Goes Viral

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధానపాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘విదా ముయార్చి’. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ హీరోయిన్ త్రిష క‌థ‌నాయిక‌గా న‌టిస్తోంది. ఏకే 62గా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో అజిత్ ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ ఫీట్స్ చేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే ఆయన ఒకసారి ప్రమాదం బారిన కూడా పడ్డారు. తాజాగా ఇందుకు సంబంధించి ఈ చిత్రంలో ఆయన చేసిన ఒక స్టంట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘విదా ముయార్చి’ చిత్రం షూటింగ్ గ‌తేడాది న‌వంబ‌ర్‌లో అజ‌ర్‌బైజాన్ దేశంలో జ‌రిగింది. ఈ సందర్భంగా అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. షూటింగ్‌లో భాగంగా ఒక కారులో హీరో అజిత్ మరియు మరో నటుడు కలిసి ప్రయాణిస్తున్నారు. కారుని అజిత్ విపరీతమైన వేగంతో నడుపుతుండగా.. కొద్దిదూరం వెళ్లిన తర్వాత అదుపుత‌ప్పి వాహనం బోల్తా పడింది. దీంతో షాక్ అయిన ఒంటి సభ్యులు పరుగుపరుగున అజిత్ వద్దకు చేరుకోవడం వీడియోలో కనిపించింది. అయితే ఈ ప్ర‌మాదంలో అజిత్‌కు గాయాలేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా దీనిని పంచుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది జ‌రిగి 5 నెల‌లు అవుతోంద‌ని, లేటెస్ట్ వీడియో కాద‌ని తెలిపింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ హీరో అజిత్ కు ఏమీ కాలేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఇక డూప్ లేకుండా అజిత్ ఇలా డేరింగ్ స్టంట్స్ చేస్తుండటంపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే అజిత్ డూప్ లేకుండా రిస్కీ ఫీట్స్ చేయ‌డం కొత్తేమి కాదని, ఇంతకుముందు ‘మంగాత్తా’ (తెలుగులో గ్యాంబ్ల‌ర్) సినిమా కోసం కూడా అజిత్ డూప్ లేకుండా బైక్ రైడింగ్ చేశారని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 14 =