ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ వాయిదా

rashmika mandanna the girlfriend movie teaser release postponed

తన సినిమాలతో నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఏప్రిల్ 5వ తేదీన రష్మిక మందన్న పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. తన పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే రాహుల్ కూడా తెలిపాడు. ఇప్పటికే రష్మిక ఐదు భాషల్లో టీజర్ డబ్బింగ్ కంప్లీట్ చేసిందని కూడా పోస్ట్ చేశారు. అయితే తాజాగా టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు. రాహుల్ రవీంద్రన్ తన ట్విట్టర్ ద్వారా రష్మిక పుట్టినరోజు ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రెడీగా ఉంది. కానీ టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం. అందుకే ప్రస్తుతానికి టీజర్ లాంచ్ ని వాయిదా వేస్తున్నాము. రష్మిక తన ఫ్యాన్స్ తో కలిపి ఓ ఈవెంట్ ని నిర్వహించి టీజర్ రిలీజ్ చేస్తాము. కొత్త డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తాము. ది గర్ల్‌ఫ్రెండ్ ని మీకు త్వరలో పరిచయం చేస్తాము అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.