పుష్ప 2 షూటింగ్ అప్డేట్ 

pushpa 2 shooting update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ టీజర్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈనెల 8న విడుదలకానుంది. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా టీజర్ ను కట్ చేసి సినిమాకు వున్న హైప్ ను డబుల్ చేయాలనీ టీమ్ డిసైడ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు  60శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మే లోగా అల్లు అర్జున్ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసి జూన్ లో మొత్తం సినిమాను పూర్తి చేయనున్నారు.సినిమాలో స్పెషల్ సాంగ్ ను కూడా చిత్రీకరించాల్సి వుంది.ఈసినిమాకు ఎక్కువ గ్రాఫిక్స్ కూడా అవసరం లేదు కనుక షూటింగ్ అనుకున్న ప్రకారం పూర్తి చేస్తే ఆగస్టు 15న రిలీజ్ అవ్వడం ఖాయం.

తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ హైప్ వుంది.హిట్ టాక్ వస్తే మాత్రం 1000కోట్లు రాబట్టడం సాధ్యమే.జీనియస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.,మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.ఇక అల్లు అర్జున్ బర్త్ డే రోజు తన తదుపరి సినిమాల గురించి కూడా అప్డేట్ వచ్చే ఛాన్స్ వుంది.అయితే బర్త్ డే సందర్భంగా ఆర్య 2 రీ రిలీజ్ ఉంటుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.ఈ రీ రిలీజ్ క్యాన్సల్ అయిందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =