మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు మొదలుకానుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా దీనిపై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ హైద్రాబాద్ లో మొదలైందని తెలియచేశారు. ఈసందర్భంగా సెట్ నుండి ఒక ఫొటో కూడా పోస్ట్ చేశారు. ఇక ఫొటోను బట్టి ఈ యాక్షన్ సన్నివేశాలు రామ్-లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో జరగనున్నట్టు అర్థమవుతుంది.
An action packed schedule begins for #Vishwambhara ❤️🔥
MEGASTAR @KChiruTweets is taking part in a high intense action sequence choreographed by #RamLakshman Masters 🔥
In cinemas 10th Jan 2025 🌠@trishtrashers @DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota… pic.twitter.com/s2AMAa2xRq
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 2, 2024
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: