నేను చేసుకునే అమ్మాయి నాకొక్కడికే నచ్చితే సరిపోదు – విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Interesting Comments About His Marriage and Life Partner

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్ టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొని ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా హైలైట్స్ వివరించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “నిజ జీవితంలో మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే పర్సన్ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు ఆయన లైఫ్ లోని అనుభవాలను ఊహించుకుంటూ చెప్పాడు” అని తెలిపారు.

“అలాగే ఈ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకువచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు గోవర్థన్ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎమోషన్స్ పలికించడం సులువు అవుతుంది. ఆయన ఎలా ఫ్యామిలీ కోసం పనిచేసేవారో గుర్తుకువస్తుంటుంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 8న నాన్న బర్త్ డే. ఈ సినిమా విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నా. ఇక నేను లైఫ్ పార్టనర్‌గా చేసుకునే అమ్మాయి నాకొక్కడికే నచ్చితే సరిపోదు, మా ఇంట్లో వాళ్లకు కూడా నచ్చాలి. అయితే అలా నచ్చేలా నేను చూసుకోవాలి” అని వివరించారు హీరో విజయ్ దేవరకొండ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + seven =