ప్రేమలు- ఫైనల్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

official premalu movie ott release date fixed

మలయాళం సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో కూడా మంచి విజయాలను అందిస్తుండటంతో మేకర్స్ కూడా ఈసినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన సినిమా ప్రేమలు. మలయాళంలో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇక్కడ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా మంచి విజయాన్ని కలెక్షన్స్ ను అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు ఆ అప్ డేట్ రానే వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ముందు నుండీ అంటున్నట్టే ఈసినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ కు రానుంది. అయితే మలయాళంలో మాత్రమే ఈసినిమా స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగు ఇంకా మిగితా భాషలకు సంబంధించిన అప్ డేట్ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.

కాగా గిరీష్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో మమితా బైజు, నస్లేన్, ఇంకా అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈసినిమాకు సంగీతం..విష్ణు విజయ్, సినిమాటోగ్రఫి.. అజ్మల్ సాంబు అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 5 =