విజ‌య్‌తో త్వరలో భారీ పాన్ ఇండియా మూవీ – దిల్ రాజు

Producer Dil Raju Announces Pan India Movie with Vijay Deverakonda

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్ టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “విజయ్ దేవరకొండ హీరోగా మా సంస్థలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ఉంటుంది. దానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు టైమ్ పట్టేలా ఉంది. అదంతా పూర్తయ్యాక ఆ మూవీ తప్పకుండా సెట్స్ మీదకు తీసుకెళ్తాం. విజయ్ ప్రొడ్సూసర్స్ గురించి ఆలోచించే హీరో. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా. ఇక మా సంస్థలో విజ‌య్‌తో తను చేస్తున్న సినిమాను సక్సెస్ చేయాలనే తపన పరశురామ్ లో ఉంది. ఈ సినిమా కోసం అతను ఎంతో కష్టపడుతున్నాడు” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 14 =