గిరీష్ దర్శకత్వంలో మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రేమలు. మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా అక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. దాదాపు 135కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ లవ్ స్టోరీకి తెలుగులో 90’s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య రాసిన డైలాగులు కడుపుబ్బా నవ్వించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా ఏప్రిల్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుందని కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే తెలుగు వెర్షన్ మాత్రం ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుందని టాక్. ఇది కూడా ఏప్రిల్ 12న రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
కాగా ఈసినిమాలో ఇంకా అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈసినిమాకు సంగీతం..విష్ణు విజయ్, సినిమాటోగ్రఫి.. అజ్మల్ సాంబు అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: