విజయ్ దేవరకొండ -పరుశురాం -దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు వస్తుంది.పరుశురాంతో విజయ్ కి ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన గీత గోవిందం విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో మాత్రం విజయ్ కి ఇదే మొదటి సినిమా.అంచనాలు కూడా సాలిడ్ గా వున్నాయి.సినిమాను కూడా భారీ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విజయ్ తో మరో రెండు సినిమాలు చేయనున్నామని దిల్ రాజు చెప్పేశాడు.ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ విజయ్ నిర్మాతల గురించి ఆలోచించే హీరో అని మా ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని అందుకే ఫ్యామిలీ స్టార్ తర్వాత అతనితో మరో రెండు సినిమాలు చేయనున్నామని అన్నారు.ఇక ఫ్యామిలీ స్టార్ సమ్మర్ లో బాగా వర్క్ అవుట్ అవుతుందని దిల్ రాజు కాన్ఫిడెంట్ గా వున్నారు.
అటు విజయ్ కూడా ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.గీత గోవిందం మ్యాజిక్ ఈసారి కూడా రిపీట్ అవుతుందని విజయ్ కూడా చాలా నమ్మకం తో వున్నాడు.ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించడంతో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించాడు.అయితే ఈసినిమాకు టిల్లు స్క్వేర్ నుండి పోటీ తప్పేలాలేదు.గత వారం విడుదలైన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుంది. మరి ఫ్యామిలీ స్టార్, టిల్లుని ఏ రేంజ్ లో డామినేట్ చేస్తాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: