ఫ్యామిలీ స్టార్ కళ్యాణి వచ్చా వీడియో సాంగ్ రిలీజ్

Kalyani Vaccha Vacchaa Video Song out from family star movie

రౌడీహీరో విజయ్‌ దేవరకొండ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి తో డీసెంట్ హిట్ ను అందుకోగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా సెన్సార్ కూడా పూర్తిచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బృందం ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను పలు పాటలను రిలీజ్ చేయగా అన్నీ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి కళ్యాణి వచ్చా వచ్చా పాటను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. పాటకు మంచి రెస్పాన్స్ కూాడా వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మంగ్లీ, కార్తీక్ పాడిన ఈపాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.

కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 10 =