యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ఈనేపథ్యంలోనే త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రానున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా మే 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నేడు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. ఈరోజు ఉదయాన్నే విశ్వక్ 10వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈసినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు మెకానిక్ రాకీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈసినిమా వస్తుంది. తాజాగా ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు లైలా అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇంకా కాస్ట్ అండ్ క్రూ వివరాలు కూడా తెలియచేశారు. టైటిల్ గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈసినిమాకు తనిష్క్ బగ్చి సంగీతం.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్.. వాసుదేవ మూర్తి రైటర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: