తలైవర్ 171 ఫస్ట్ లుక్ రిలీజ్ 

Thalaivar 171 first look poster out

చాలా కాలం తరువాత జైలర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. గత ఏడాది విడుదలైన ఈసినిమా ఏకంగా 600కోట్ల వసూళ్లను రాబట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక ఈసినిమా తరువాత రజినీకాంత్ ఇటీవల లాల్ సలామ్ లో కనిపించాడు.అయితే ఇందులో క్యామియో రోల్ చేశాడు.ఈసినిమా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రస్తుతం రజినీకాంత్, వెట్టైయన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.జై భీమ్ ఫేమ్ టిజి జ్ఞానవేల్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇది రజినీకి 170వ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తన 171 సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేయనున్నాడనితెలిసిందే. ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో రజినీ యంగ్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు.పోస్టర్ చూస్తుంటే లోకేష్ ,రజినీని సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నాడు.ఏప్రిల్ 22న టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా అన్బు- అరివ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

ఈసినిమా తర్వాత రజినీకాంత్  జైలర్ సీక్వెల్ జైలర్ 2 లో నటించనున్నాడు.డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =