లెజెండ్ అంటే చరిత్ర సృష్టించే వాడు తిరగరాసేవాడు – బోయపాటి శ్రీను

Director Boyapati Sreenu Attends Legend 10 Years Blockbuster Celebrations

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి ఇప్పటివరకు మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. వాటిలో ఒకటి ‘లెజెండ్’ చిత్రం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించారు. 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలని ఘనంగా నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వేడుకలో పాల్గొన్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. లెజెండ్ ని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారికి అంకితం చేస్తూ ఈ సినిమాని మొదలుపెట్టాం. ఆయన ఆశీస్సులతోనే పదేళ్ళ వేడుక జరుపుకుంటున్నాం. ఆ తరానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ గారు ఆ తరానికి లెజెండ్. ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన లెజెండ్ బాలయ్య గారు. ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు దర్శకుడిగా గర్వపడుతున్నాను. లెజెండ్ అంటే చరిత్ర సృష్టించే వాడు తిరగరాసేవాడు. ఈ సినిమా అదే చేసింది. మూడేళ్ళు ఆడి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “పదేళ్ళు గడిచినా ఈ వేడుక చూస్తుంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లా అనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ గారి నమ్మకమే.. సింహ, లెజెండ్, అఖండ సినిమాలు. మేము చేసే ప్రతి సినిమా ఇలానే పదేళ్ళు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. లెజెండ్ మాపై బాద్యత పెంచింది. ఆ భాద్యతతో, కసితో చేసిన సినిమానే ‘అఖండ’. ఇకపై మేము చేసే ఏ సినిమానైనా ఇంతే భాద్యతతో ఒక యజ్ఞంలా చేసి మీ ముందుకు తీసుకొస్తాం. ఈ సినిమాకి పని చేసిన నటీనటులందరికీ పేరుపేరున ధన్యవాదాలు” అని తెలిపారు.

“జగపతిబాబు గారు అద్భుతమైన పాత్ర చేశారు. చలపతి రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. కెమరామెన్ రామ్ ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్,. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. లెజెండ్ మార్చి 30న రీరిలీజ్ చేస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకులు మళ్ళీ అదే తరహలో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇకపై మా కాంబినేషన్‌లో ఇంతకంటే మంచి సినిమా చేస్తానని మాటిస్తున్నా’’ అని చెప్పారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =