లక్నోలో మిస్టర్ బచ్చన్ టీమ్ సందడి

ravi teja mr bachchan movie new schedule starts in lucknow today

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా కొత్త షెడ్యూల్ నేడు లక్నో లో స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. రవితేజ త్వరలో ఈషెడ్యూల్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ లక్నోలోనే పలు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. అంతేకాదు ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుందని అంటున్నారు.

కాగా ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + five =