కల్కి 2898 AD లో భైరవ పాత్ర చాలా కాలం గుర్తుంటుంది

producer swapna dutt about prabhas bhairava role in kalki 2898 AD

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది ఈ కథ. ఇక ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి నిర్మాత స్వప్నా దత్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వప్నాదత్ ను ఈసినిమా గురించి కల్కి 2898 ఏడీ మూవీ గురించి మాట్లాడుతూ.. ఈసినిమా విడుద‌లైన త‌ర్వాత ప్రభాస్ భైర‌వ పాత్ర చాలా కాలం పాటు ప్రేక్ష‌కుల హృదయాల్లో నిలిచిపోతుందంటూ చెప్పుకొచ్చింది.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =