‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ హైలైట్స్

Om Bheem Bush Movie Trailer Highlights

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ పాజిటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘ఓం భీమ్ బుష్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక గ్రామంలోకి శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ వచ్చాక, బ్యాంగ్ బ్రోస్ ఏ టు జెడ్ సొల్యూషన్స్‌ను ఎస్టాబెల్స్ చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ ముగ్గురూ వివిధ సమస్యలకు పరిష్కారంగా ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు. వారి వ్యాపారం పుంజుకున్నప్పుడు, అఘోరాల సమూహం గ్రామాల్లోకి ప్రవేశించి, రహస్యమైన సంపంగి మహల్‌లో నిధిని కనుగొనమని సవాలు విసురుతుంది. మిగిలిన కథ హాంటెడ్ హౌస్‌లో నిధిని కనుగొనడానికి బ్యాంగ్ బ్రోస్ యొక్క పోరాటాలని గురించి. ఎంటర్ టైన్మెంట్, యువతను ఆకట్టుకునే అంశాలు కాకుండా, ట్రైలర్ సూచించినట్లుగా సినిమాలో ట్రెజర్ హంట్, హారర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఉన్నాయి.

శ్రీవిష్ణు తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. సామజవరగమనతో ఇంత పెద్ద హిట్ కొట్టినప్పటికీ, నవ్వులు పంచడానికి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు సమానమైన స్థానాన్ని కల్పించిన శ్రీవిష్ణును తప్పకుండా అభినందించాలి. వారి స్పాంటేనియస్ డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణనిచ్చాయి. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా కనిపించగా, బ్యాంగ్ బ్రోస్ పాటలో ప్రియా వడ్లమాని అలరించింది శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చరవి ఇతర ముఖ్య తారాగణం.

కామెడీ సన్నివేశాలను డీల్ చేయడంలో శ్రీ హర్ష కొనుగంటి మరోసారి తన ప్రతిభ చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా అన్ని హంగులను సరిగ్గా ప్రజెంట్ చేశాడు. రాజ్ తోట తన కెమెరా పనితనంతో విజువల్స్‌కు వైబ్రేషన్‌ని తీసుకొచ్చాడు, సన్నీ MR తన స్కోర్‌తో హిలేరియస్ మూడ్‌ను సెట్ చేశాడు. V సెల్యులాయిడ్ ప్రొడక్షన్ డిజైన్ లావిష్‌గా వుంది. ఓం భీమ్ బుష్ అత్యంత వినోదాత్మకంగా ఉంటుందని ట్రైలర్ ప్రామిస్ చేసింది. ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =