షూటింగ్ పూర్తిచేసుకున్న ఫ్యామిలీ స్టార్

vijay deverakonda family star movie shoot wrapped up

రౌడీహీరో విజయ్‌ దేవరకొండ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి తో డీసెంట్ హిట్ ను అందుకోగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను అలానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇన్ని రోజులు షూటింగ్ తో చిత్రయూనిట్ బిజీగా ఉండగా.. ఇప్పుడు షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాదు ట్రైలర్ అనౌన్స్ మెంట్ ను కూడా త్వరలో ఇవ్వనున్నట్టు తెలియచేశారు.

కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + nine =