గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

gangs of godavari movie new release date update

రీసెంట్ గానే గామి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈసినిమా విజువల్ వండర్ గా ఉండి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు విశ్వక్ సేన్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అన్నీ అనుకున్నట్టు జరిగిఉంటే ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి ఉండేది. మార్చి 8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ కాలేదు వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మే 17వతేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో నేహా శెట్టి  హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + seventeen =