న్యాచురల్ స్టార్ నాని మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా ఇంకా హాయ్ నాన్న సినిమాలతో అలరించగా అందులో దసరా బ్లాక్ బస్టర్ ను అందించగా హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. అంతేకాదు ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న గ్లింప్స్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా కొత్త షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. మార్చి 18వ తేదీన ఈసినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు అధికారికంగా తెలిపారు.
Pinning up the MADNESS
to reignite the FULL RAGE! 💥💥 #SaripodhaaSanivaaram Next Schedule Begins on March 18th! #SuryasSaturdayNatural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari @DVVMovies… pic.twitter.com/7eWNII849U
— DVV Entertainment (@DVVMovies) March 16, 2024
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































