టిల్లు స్క్వేర్ నుండి ఓ మై లిల్లీ సాంగ్ ప్రోమో రిలీజ్

Oh my Lilly song promo out from Tillu Sqaure Movie

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయనున్నారు. ఈనేపధ్యంలోనే తాజాగా ఈపాటకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఓ మై లీల్లీ అనే పాటను రిలీజ్ చేయనుండగా.. ఇప్పుడు పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ ను మార్చి18 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − twelve =