నాని-వేణు మూవీ టైటిల్ కన్ఫామ్ చేసిన దిల్ రాజు

dil raju clarity on nani and venu movie title

న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఎలాంటి గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇంకా సుజీత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నాని బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈసినిమా టైటిల్ పై కూడా వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈసినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజును నాని-వేణు మూవీ అప్ డేట్ అడుగగా.. ఫైనల్ అయింది యల్లమ్మ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =