తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు అటు తెలుగు, ఇటు తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వాటిలో తన దర్శకత్వంలోనే వస్తున్న ఒక సినిమా కూడా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఈమధ్యే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయన్ అనే టైటిల్ ను ఈసినిమాను ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న కీలకపాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న ఎస్ జే సూర్య పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సెల్వరాఘవన్ కూడాా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈమేరకు ధనుష్ తన ట్విట్టర్ ద్వారా సెల్వరాఘవన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మిమ్మల్ని డైరెక్ట్ చేస్తా అనుకోలేదు సార్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
Never thought I’ll direct you someday sir 🙏🙏 @selvaraghavan pic.twitter.com/X1TnkaGqAR
— Dhanush (@dhanushkraja) February 22, 2024
కాగా ఈసినిమాలో ఇంకా అపర్ణా బాలమురళి, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: