మాలీవుడ్ ను షేక్ చేస్తుంది ప్రేమలు అనే సినిమా.మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి కేవలం 12రోజుల్లోనే 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టిస్తుంది.ఫుల్ రన్ లో 75కోట్ల వరకు వెళ్లేలానే వుంది. సినిమాలకు ఇది సరైన సీజన్ కాకపోయినా ప్రేమలు అదరగొడుతుంది.కేవలం10కోట్ల బడ్జెట్ తో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేరళ నుండి ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ కు వచ్చిన కొందరు మలయాళీలు ఎలాంటి పరిస్థుతులను ఎదుర్కొన్నారు అనే పాయింట్ తో ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈసినిమా.ఇక ఈసినిమాకు వస్తున్న రెస్సాన్స్ చూసి తెలుగు లో కూడా డబ్ చేసి విడుదలచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరి తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.త్వరలోనే ఈ రిలీజ్ ఈవిషయంలో క్లారిటీ రానుంది.
ఈసినిమాను ప్రముఖ నటుడు పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ నిర్మించగా గిరీష్ ఏడి డైరెక్ట్ చేశాడు.మమితా బైజు,నస్లేన్,అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ లీడ్ రోల్స్ లో నటించారు.విష్ణు విజయ్ సంగీతం అందించాడు.మొత్తానికి ఒకప్పుడు ప్రేమమ్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ఇప్పుడు ఈ ప్రేమలు అలాంటి సెన్సేషనే సృష్టిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: