యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ ఊరుపేరు భైరవకోన బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తుంది.అన్ సీజన్ అయినా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.నాలుగు రోజుల్లో ఈసినిమా 22కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ముఖ్యంగా నైజాంలో సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటితో అక్కడ 5కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది.500k డాలర్ మార్క్ ను చేరుకోనుంది.మొత్తానికి ఎన్నో రోజుల నుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూసిన సందీప్ కిషన్ కు భైరవకోన ఆ కోరిక తీర్చింది.వి ఐ ఆనంద్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా వర్ష బొల్లమ్మ,కావ్య థాపర్ హీరోయిన్లు గా నటించారు.శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈసినిమాను నిర్మించాడు.
ఇక ఈసినిమా విజయం సాధించడంతో వి ఐ ఆనంద్ కు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తన బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: