రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో తేజ్

Sai Dharam Tej At Traffic Awareness Event

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆమధ్య రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆ ప్రమాదం నుండి కోలుకోవడానికి తేజ్ కు చాలా సమయమే పట్టింది. అందుకే అప్పటినుండీ తనకు కుదిరినప్పుడల్లా డ్రైవింగ్ గురించి కానీ, హెల్మెట్ ప్రాధాన్యత గురించి కానీ చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు. హైదరాబాద్ పోలీసులు సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీలో నిర్వహించిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించమని.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా విరూపాక్ష, బ్రో సినిమాలతో వరుసగా హిట్లను అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాంజాా శంకర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + three =