నాగచైతన్యను కలిసిన శివ నిర్వాణ.. కాంబో రిపీట్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌

Naga Chaitanya and Director Shiva Nirvana Pics Goes Viral

టాలీవుడ్ స్టార్ హీరో, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా చేస్తోన్న తాజా చిత్రం ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మత్స్యకారుడు గణగల్ల రామారావు జీవితాన్ని చూపించనున్నారు. కెరీర్ లో తొలిసారి ఇలాంటి విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్న నాగచైతన్య అందుకోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ శివ నిర్వాణ హీరో నాగ చైతన్యను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైర‌ల్‌గా మారింది. అందులో చూస్తుంటే.. వీరు ఏదో రెస్టారెంట్‌లో కలిసినట్లు అనిపిస్తోంది.

ప్రస్తుతం వీరి కలయిక ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నాగ చైతన్య, శివ నిర్వాణ కలయికలో త్వరలో ఏదైనా సినిమా రానుందా? అని అక్కినేని అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే.. ? ఇప్పటికే వీరి కలయికలో 2 సినిమాలు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. 2018లో వచ్చిన ‘సవ్యసాచి’ తొలి సినిమా కాగా.. 2019లో విడుదలైన ‘మజిలీ’ చిత్రం రెండోది. వీటిలో ‘మజిలీ’ సక్సెస్ అందుకుంది. ఇక శివ నిర్వాణ గత సినిమా ‘ఖుషి’ ప్రేక్షకులను బాగానే అలరించింది. మజిలీ, ఖుషి.. ఈ రెండు చిత్రాలలో హీరోయిన్ సమంత కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాగ చైతన్యను శివ నిర్వాణ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =