పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చేతులు మారనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ బాధ్యతలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అప్పగించనుందని వార్తలు వచ్చాయి దీనిపై డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా క్లారిటీ ఇచ్చింది.అలాంటిది ఏమిలేదు ఓజీ ఎప్పటికీ మా సినిమానే అని చెప్పేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈన్యూస్ గురించి తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒకరైన విశ్వప్రసాద్ ను అడుగగా ఓజీ సినిమా గురించి అసలు అలాంటి ప్రస్తావనే రాలేదు వాళ్ళు ఇస్తామనలేదు మేము తీసుకుంటామనలేదు అసలు ఆన్యూస్ ఎలా పుట్టిందో తెలియదు అని అన్నారు.
ఓజి విషయానికి వస్తే ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం టీం ఎదురుచూస్తుంది ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ ను పూర్తి చేయాలనీ చూస్తుంది.అంతేకాదు సెప్టెంబర్ 27న ఈసినిమాను విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారు.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























