న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు పూర్తి కావొచ్చింది.ఇంకా 30శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు కానీ బిజినెస్ మాత్రం యమ స్పీడ్ గా జరుగుతుంది.ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు,శిరీష్ దక్కించుకున్నారు.నైజాంతోపాటు ఆంధ్రాకు గాను ఈ హక్కులను సొంతం చేసుకున్నారు.భారీ మొత్తానికి ఈడీల్ కుదిరిందట.ఇక ఇప్పుడు ఓటిటి రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెట్ ఫ్లిక్స్ ఈసినిమా ఓటిటి రైట్స్ ను భారీ ధరకు దక్కించుకుంది.ఇంతకుముందు నాని నటించిన చివరి నాలుగు సినిమాలు నెట్ ఫ్లిక్సే స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.వీటన్నింటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇటీవల హాయ్ నాన్న స్ట్రీమింగ్ లోకి తీసుకొని రాగ ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.వీటికి తోడు రీసెంట్ నాని ట్రాక్ రికార్డు కూడా అదిరిపోయింది బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి పుల్ ఫామ్ లో ఉండడం తో సరిపోదా శనివారం ఓటిటి హక్కులను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.నాని కెరీర్ లో ఇదే హైయెస్ట్ ఓటిటి డీల్ అని సమాచారం.
ఇక సరిపోదా శనివారంను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నటుడు ,డైరెక్టర్ ఎస్ జె సూర్య ఈసినిమాలో విలన్ గా కనిపించనున్నాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలచేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: