సామ్ బ్యాక్ టు వర్క్

samantha starts her dubbing work for indian citadel version

సమంత గత కొంతకాలంగా బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఆమధ్య మయోసైటిస్ తో బాధపడిన సమంత ఆ తరువాత కోలుకొని తన సినిమాల షూటింగ్ లను అలానే వెబ్ సిరీస్ ను పూర్తి చేసేసింది. అనంతరం.. ఒక ఏడాది రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకొని అప్పట్లో సోషల్ మీడియా ద్వారే తెలియచేసింది. చెప్పినట్టే ఇన్ని రోజులు ఎలాంటి షూటింగ్ లు, సినిమాలు లేకుండా ట్రిప్స్ కు వెళుతూ ట్రీట్ మెంట్ ను తీసుకుంటూ ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ తన వర్క్ పై ఫోకస్ ను పెట్టేసింది సమంత. ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా డబ్బింగ్ ను చెప్పే ఫొటోను పోస్ట్ చేసింది. ఫొటోలో కింద రాజ్ అండ్ డీకే అని ట్యాగ్ ఇచ్చింది. దీంతో తను డబ్బింగ్ చెబుతుంది ఇండియన్ వెర్షన్ లో వస్తున్న సిటాడెల్ సిరీస్ కు అని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా హాలీవుడ్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ఇక ఇక్కడ రాజ్, డీకే లు ఇండియన్ వెర్షన్ కు దర్శకత్వంలో వహిస్తున్నారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈ వెబ్ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో 2024 ఏఫ్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. కాగా హాలీవుడ్ నిర్మాతలు రుసో సోదరులు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తుంది. మరి ఈవెబ్ సిరీస్ ను చూడాలంటే ఫ్యాన్స్ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 8 =