యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్ 1 ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది.రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.ఇటీవల షూటింగ్ లో సంధర్భంగా సైఫ్ గాయపడ్డాడు దాంతో ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది దేవర టీం.ఇక ఈసినిమా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారంలో మొదలుకానుంది.ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే ఈసినిమా విడుదల వాయిదాపడనుందనే వార్తలు గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.దేవర మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదలచేస్తామని ప్రకటించారు అయితే ఈ డేట్ మారనుందట.అనుకున్న టైంకి షూటింగ్ కాకపోవడంతో వాయిదాపడనుందని న్యూస్ బలంగా వినిపిస్తుంది అయితే ఇప్పటివరకు ఈ రిలీజ్ డేట్ మార్పు పై స్పందించలేదు త్వరలోనే ఈవిషయంలో క్లారిటీ రానుంది.
కొరటాల శివ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది తెలుగులో ఆమె కు ఇదే మొదటి సినిమా.అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర పాటలపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.భారీ బడ్జెట్ తో ఈసినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: