జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే భగవంత్ కేసరి సినిమాలోని తమ బ్రిలియంట్ పెర్ఫామెన్స్ కు కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ కు అవార్డులు దక్కాయి. ఇక ఇప్పుడు మరో సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి. ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకున్న మంగళవారం సినిమా. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వచ్చిన సినిమా మంగళవారం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొత్తం నాలుగు అవార్డ్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఉత్తమ నటిగా పాయల్ రాజ్ పుత్ కి అలాగే బెస్ట్ సౌండ్ డిజైన్ అందించిన ఎం ఆర్ రాజా కృష్ణన్ కి అలాగే బెస్ట్ ఎడిటింగ్ కి గాను గుళ్ళపల్లి మాధవ్ కుమార్, ఫైనల్ గా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ముదసర్ మొహమ్మద్ కి వచ్చాయి.
Much applauded rustic thriller, @DirAjayBhupathi‘s #Mangalavaram has bagged 4 Awards at prestigious #JaipurFilmFestival 🔥
Best Actress: @starlingpayal
Best Sound Design: @rajakrishnan_mr
Best Editing: @gullapallikumar
Best Costume Design: @mudasarmd@JIFFJaipur @AJANEESHB pic.twitter.com/75gzFcIBq8— A Creative Works (@ACreativeWorks_) January 29, 2024
కాగా ఈసినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో ఇంకా నందితా శ్వేతా,అజయ్ ఘోష్,ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. ముద్రా మీడియా వర్క్స్ ,ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























