ఈమధ్య సినిమా రిలీజ్ డేట్లకు మాత్రం కాంపిటీషన్ పెరిగిపోతుంది. ముందు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నా ఏదో ఒక కారణం చేత వాయిదా పడుతున్నాయి.. మరోవైపు కొన్ని పెద్ద సినిమాలు వల్ల కూడా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. సింగిల్ రిలీజ్ డేట్ లో రావాలని ప్రయత్నించినా అది ఇప్పుడు కుదరని పని. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు దిల్ రాజు. అయితే దిల్ రాజు ఇచ్చిన అప్ డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా వస్తుందని చెప్పారు. ఈ స్టేట్ మెంట్ వల్లే ఇప్పుడు ఈ అప్ డేట్ వైరల్ అవుతుంది. నిజానికి గత కొద్దిరోజులుగా దేవర రిలీజ్ డేట్ పై పలు వార్తలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ పలు కథనాలు వచ్చాయి. దానికి తోడు సైఫ్ అలీ ఖాన్ కు గాయాలవ్వడంతో వార్తలకు మరింత ఊతమిచ్చినట్టైంది. ఇక ఈ సస్పెన్స్ ఇలా కొనసాగతుండగానే దిల్ రాజు దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ అయిన ఆగష్ట్ 5వ తేదీన ఫ్యామిలీ స్టార్ వస్తుందంటూ బాంబు పేల్చారు. దీంతో దేవర రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని చెప్పనకే చెప్పారంటున్నారు. మరి దేవర మూవీ రిలీజ్ డేట్ పై త్వరలో ఏదన్నా క్లారిటీ వస్తుందేమో చూద్దాం..
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: