సౌత్ లో అత్యంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తుచ్చే పేరు అనిరుధ్ రవిచంద్రన్.కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ కి కూడా హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. జైలర్,లియో లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయంటే తన మ్యూజిక్ కూడా ఒక కారణం.ఏమి లేని సినిమాల్లో కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడు అనిరుధ్ అందుకే ఈయనకి రెమ్యూనరేషన్ ఎక్కువే అంతేకాదు తను ఏదైనా సినిమాకు కమిట్ అయితే తను ఎప్పుడు పాటలు ఇస్తే అప్పుడే తీసుకోవాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అనిరుధ్ చేతిలో 6క్రేజీ ప్రాజెక్ట్ లు వున్నాయి అందులో తెలుగు నుండి దేవర ,విజయ్ దేవరకొండ -గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాలు ఉండగా తమిళంలో రజనీకాంత్ నటిస్తున్న వెట్టయన్ అలాగే తలైవర్ 171 మూవీ కమల్ హాసన్.. ఇండియన్ 2 ,అజిత్.. విడా ముయార్చి సినిమాలు వున్నాయి.ఇవి కాక ఇంకా కొన్ని సినిమాలు చర్చల్లో వున్నాయి.ఇక కేవలం స్టార్ హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఒప్పుకుంటున్నాడు అనిరుధ్.అందులో భాగంగా తమిళం లో లవ్ స్టోరీ ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ నటిస్తున్న ఎల్ ఐ సి అనే సినిమా మ్యూజిక్ ఇస్తున్నాడు .
ఇప్పుడు తెలుగులో కూడా ఓ చిన్న సినిమాకు ఓకే చెప్పాడు అదే మ్యాజిక్.లిమిటెడ్ బడ్జెట్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.కొత్తవారితో తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ తో వస్తుంది.అలా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా అనిరుధ్ చిన్న సినిమాలకు కూడా కమిట్ అవుతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: