నేడు మెగాస్టార్ చిరంజీవి అమ్మగారి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరు ప్రేమతో తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా చిరు తన ట్వీట్ లో కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.💐💐 pic.twitter.com/MFOttIdoPj
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2024
మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. విశ్వంభర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు.
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: