మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే టికెట్టే కొనకుండా సాంగ్, రాధిక సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ ను కూడా అందించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారింది. నిజానికి ఈసినిమాను గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈసినిమా షూటింగ్ పూర్తవ్వకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ వాయిదా పడింది. తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఫైనల్ గా మార్చి 29వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. చూద్దాం మరి ఈ రిలీజ్ డేట్ అయినా ఉంటుందా లేక మళ్లీ మారుస్తారా అని..
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #TeluguFilmNagar pic.twitter.com/pFb5IpoiL1
— Telugu FilmNagar (@telugufilmnagar) January 26, 2024
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: