ఈగల్ నుండి ఈగల్ ఆన్ ద వే సాంగ్ రిలీజ్

eagle on the way song out from eagle movie

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఈగల్. గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే టీజర్ ను అలానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా రెండూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఆడు మచ్చా, గల్లంతే అనే పాటను రిలీజ్ చేయగా రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈగల్ ఆన్ ద వే అన సాంగ్ ను రిలీజ్ చేయగా.. ఈ పాట కూడా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.