ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. ఆ కాంబినేషన్ మరేదో కాదు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ సరైనోడు సినిమా వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను-అల్లు అరవింద్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు గీతా ఆర్ట్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
MASSive forces to reckon with! ❤️🔥
A magical reunion of Mass Combo, Ace Producer #AlluAravind garu & Blockbuster Director #BoyapatiSreenu garu 💥
Electrifying Update Loading Soon! ⌛️#GAwithBS 🔥 pic.twitter.com/fk1DOB8VnN
— Geetha Arts (@GeethaArts) January 26, 2024
ఇక అప్పుడే ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో హీరో ఎవరా అని చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు అల్లు అర్జున్ పేరు తో పాటు ఇప్పటికే పలువురు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మరి గత ఏడాది స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బోయపాటి. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ2 సినిమా లైన్ లో ఉంది. అల్లు అరవింద్ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈసినిమాకు సంబంధించిన విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























