ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ.ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈమధ్యే సూర్య తన పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ ను అయితే పూర్తి చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడు బాబి డియోల్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక పోస్టర్ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. బాబి డియోల్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు బాబి డియోల్ పోస్టర్ అయితే సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేసింది. మరి యానిమల్ సినిమా తరువాత బాబి డియోల్ కు మరిన్న అవకాశాలు వస్తున్నాయి. ఆసినిమాలో తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బాబి డియోల్ లుక్ చూసిన తరువాత ఈసినిమాలో తన పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది.
Ruthless. Powerful. Unforgettable🗡️
Happy Birthday to our #Udhiran, #BobbyDeol sir✨ #Kanguva 🦅 #HBDBobbyDeol @thedeol@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @PenMovies @NehaGnanavel @saregamasouth pic.twitter.com/KJ67DcjLyi
— UV Creations (@UV_Creations) January 27, 2024
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: