జై హనుమాన్ లో హనుమాన్ అతనే

star hero will do the lord hanuman role in jai hanuman

హనుమాన్ సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై విన్నర్ గా నిలిచింది.కేవలం 20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఊహించని లాభాలను తీసుకొస్తుంది.అంతేకాదు స్టార్ హీరోలకు సైతం అందని ద్రాక్షలా వున్న రికార్డులను క్రీయేట్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది.ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు వస్తున్న రెస్పాన్ చూసి వెంటనే సీక్వెల్ పనులు కూడా మొదలుపెట్టాడు ప్రశాంత్ వర్మ.జై హనుమాన్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈసినిమాను నిన్న ఆఫీషియల్ గా లాంచ్ చేశాడు.ఈసందర్బంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.జై హనుమాన్ లో తేజ సజ్జా కూడా ఉంటాడని అయితే అతను హీరోగా కాకుండా హనుమంతు గా ఉంటాడు.ఈసినిమాలో హీరో హనుమంతుడే.ఈ పాత్రను ఓ పెద్ద స్టార్ హీరో పోషించనున్నాడని తెలిపాడు.

దాంతో హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపిస్తారో అని జనాల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.ఇక ఈసినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు.త్వరలోనే జై హనుమాన్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 7 =