సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. కేవలం యాక్షన్ ను మాత్రమే కాదు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ను కూడా చాలా బాగా చూపించాడు. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈనెలలోనే ఓటీటీకి వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చినా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చింది టీమ్. దానికి కారణం సలార్ టీమ్ చేసిన ట్వీటే కారణం. అసలు సంగతేంటంటే యానిమల్ మూవీ ఒఎస్టీ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో సలార్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు ఒఎస్టీ రిలీజ్ చేస్తారని ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో ఒక ట్వీట్ ను యానిమల్ మూవీ ట్యాగ్ చేస్తూ సలార్ టీమ్ ను అడగమని రిప్లై ఇచ్చింది. దీనికి గాను సలార్ టీమ్ యానిమల్ టీమ్ ను ట్యాగ్ చేస్తూ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని అడుగుతుంది. ఈనేపథ్యంలో సలార్ టీమ్ సెల్యూట్ ద ఛాంపియన్ అంటూ ఇండియా ఫ్లాగ్ ను కూడా జోడించారు. దీన్ని బట్టి ఈసినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారని అంటున్నారు.మొత్తంగా సలార్ టీమ్, యానిమల్ టీమ్ మధ్య ఫన్నీ ట్వీట్ లు వైరల్ అవుతున్నాయి.
Let’s Salute the Champion very soon 🫡🇮🇳 https://t.co/sY6dzDlJb5
— Animal The Film (@AnimalTheFilm) January 23, 2024
కాగా ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ నిర్మించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమా అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: