హనుమాన్ హిందీలో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ చూపిస్తుంది.శనివారం 4.02కోట్ల నెట్ ను రాబట్టగా నిన్న మరో 5.25కోట్ల వసూళ్లను రాబట్టింది దాంతో 10రోజుల్లో అక్కడ 34.24కోట్ల నెట్ ను ఖాతాలో వేసుకుంది.ఫుల్ రన్ లో 50కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో హాలిడే ప్రకటించడంతో కలెక్షన్స్ మరింతగా పెరగనున్నాయి.ఇప్పటికే హిందీలో హనుమాన్, కార్తికేయ 2 లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హనుమాన్ గ్లోబల్ వైడ్ గా 10 రోజుల్లో 200కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసింది.ఫుల్ రన్ లో మరో 100కోట్ల వసూళ్లు సాధ్యమయ్యేలా వున్నాయి.సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి ఊహించని వసూళ్లతో ఎపిక్ బ్లాక్ బాస్టర్ వైపు దూసుకుపోతుంది.దాదాపు ఇప్పటి వరకు 70కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.ఈసినిమాను కొన్న బయ్యర్స్ కు జాక్ పాట్ తగిలినట్లే.
ప్రశాంత్ వర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా తేజ సజ్జా హీరోగా నటించాడు.నిరంజన్ రెడ్డి ఈసినిమాను
నిర్మించాడు.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.జై హనుమాన్ టైటిల్ తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. కుదిరితే ఈరోజు రాత్రి ఈసినిమా గురించి అప్డేట్ వచ్చే అవకాశాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: